![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి' (Krishna Mukunda Murari). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -484 లో.. కృష్ణ, ముకుంద ఇద్దరు కారులో వస్తుంటారు. నీకు నేనేం అన్యాయం చేశాను ముకుందా? ఎందుకు నన్ను ఇలా పట్టి వేదిస్తున్నావ్.. రూపం మార్చుకుని మరీ వెంటాడేంత పగ నా మీద ఎందుకు? నీకేం అన్యాయం చేశానని ముకుందని కృష్ణ అడుగగా.. నాకు నువ్వేం అన్యాయం చెయ్యలేదు కృష్ణ.. నాకు జరగాల్సిన న్యాయానికి నువ్వు అడ్డుగా ఉన్నావ్. ఆ అడ్డుని తొలగించుకోవాలని చూస్తున్నాను అంతే.. జీవితంలో నువ్వు చేసిన పెద్ద తప్పు ఏంటో తెలుసా? నా మురారీని నువ్వు పెళ్లి చేసుకోవడం.. అంతకన్నా ఇంకా పెద్ద పెద్ద తప్పు ఏంటో తెలుసా అని ముకుంద అంటుంది. అలా ఇద్దరి మధ్య కాసేపు మాటల యుద్ధం జరుగుతుంది.
మరోవైపు మురారి కోసం భవాని, రేవతి అంతా కంరుపడుతుంటారు. ఇంతలో పోలీసులు వాళ్ళింటికి వస్తారు. కృష్ణ, మీరా ఇంటికి వచ్చేసరికి పోలీసులు అక్కడే ఉంటారు. మురారీ కనిపించడం లేదని తెలుసుకున్న కృష్ణ.. ఏడుస్తూ.. ఎందుకు నాకు నిజం చెప్పలేదంటూ అందరిని అడుగుతుంది. ఆ నిజం నేను చెబుతానంటూ ఆదర్శ్ వస్తాడు. మీ మురారికేం కాలేదు.. ఈ మీరాను తల్లిని చేసి ఎక్కడికో పారిపోయాడని ఆదర్శ్ అంటాడు. అది విని కృష్ణ షాక్ అవుతుంది. మొత్తం నా ప్లానే అన్నట్లుగా మీరా అలియాస్ ముకుంద నవ్వుకుంటుంది. ఏసీపీ సారే నేరుగా తనని తల్లిని చేసినట్లు ముకుంద చెప్పుకుందన్న మాట అని కృష్ణ మనసులో అనుకుంటుంది. ఇంతలో ఎస్ఐ.. భవానిని పక్కకు పిలుస్తాడు. మేడమ్.. మీ మురారీ గారు భార్యకు కూడా ఏం చెప్పకుండా వెళ్లారంటే.. ఎక్కడో ఏదైనా చిన్న నోట్ రాసి పెట్టి ఉంటారు. మీరు ఇళ్లంతా వెతకండి అని సలహా ఇస్తాడు. అది కాస్త మీరా చాటుగా వినేసి.. కృష్ణ హెల్త్ రిపోర్ట్స్ మొత్తం భవాని చూసేలా చేస్తుంది. గది మొత్తం భవాని వెతుకుతుండగా.. అప్పుడే కృష్ణ హెల్త్ రిపోర్ట్స్ దొరుకుతాయి.
తరువాయి భాగంలో భవాని ఆ రిపోర్ట్స్ పట్టుకుని.. కృష్ణ అంటూ పెద్దగా అరుస్తుంది. అక్కడికి కృష్ణ రాగానే.. లాగిపెట్టి కొట్టి.. ఎంత మోసం చేశావేనని భవాని అంటుంది. ఇక అక్కడే ఉన్న ఆదర్శ్.. భవాని చేతిలోని రిపోర్ట్స్ తీసుకుని చదివి.. ఈ కృష్ణ జీవితంలో తల్లి కాలేదు. కానీ తల్లి అయినట్లు నటిస్తోంది పిన్నీ అని అంటూ రేవతి వాళ్లకు వివరంగా చెబుతాడు. అది చూసి మీరా నవ్వుకుంటుంది. ఇక భవాని కోపం చూస్తుంటే.. కృష్ణను బయటికి పంపించేసేలా ఉంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |